కాకినాడ జిల్లాలో విషాదం.. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల బాలిక మృతి!

  • వెలమకొత్తూరులో పందులను చంపేందుకు నాటు తుపాకీతో కాల్పులు
  • ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల ధన్యశ్రీకి తగిలిన తూటా
  • ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయిన చిన్నారి
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుని మండలం వెలమకొత్తూరులో నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. పందులను చంపేందుకు నాటు తుపాకీతో కాల్పులు జరిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. 

ఈ రోజు ఉదయం వెలమకొత్తూరులో పెంపుడు పందులను చంపేందుకు గ్రామస్తులు నాటు తుపాకీని ఉపయోగించారు. ఇదే సమయంలో ఇంటి బయట తోటి పిల్లలతో నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఆడుకుంటోంది. అయితే ప్రమాదవశాత్తు తూటా ధన్యశ్రీకి తగిలింది.

దీంతో ఆడుకుంటున్న చోటే చిన్నారి కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే చనిపోయింది. 
నిబంధనలకు విరుద్ధంగా నాటు తుపాకులను ఉపయోగించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

kakinada district
country made Gun
miss fire
Gun Firing
Tuni
girl died

More Telugu News